నాలుగు దశాబ్దాల కాలంలో దేశంలో హిందువుల సంఖ్య పెరిగినా శాతం ప్రకారం చూస్తే దాదాపు మూడు శాతం తగ్గుదల ఉంది. లోక్‌సభలో సభ్యుడు రాకేష్ సింగ్ అడిగిన ఓ లిఖితపూర్వక ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హన్స్‌రాజ్ జి.ఆహిర్ ఈ మేరకు సమాధానమిచ్చారు. 1971లో 82.7 శాతంగా ఉన్న హిందువుల జనాభా 2011 నాటికి 79.8 శాతానికి తగ్గిందని చెప్పారు. ‘‘1971 జనాభా లెక్కల ప్రకారం 45.33 కోట్లుగా ఉన్న వీరి సంఖ్య 2011 నాటికి 96.62 కోట్లకు చేరింది. 1971 గణాంకాల్లో సిక్కిం జనాభాను మినహాయించారు. 1981లో అసోం, 1991లో జమ్మూకశ్మీర్, 2001లో మణిపూర్‌లోని సేనాపతి జిల్లా మావో మారం, పావో మట, పురుల్ సబ్డివిజన్లలోని జనాభాను పరిగణనలోకి తీసుకోలేదు. ఆయా సంవత్సరాల్లో ఆ రాష్ట్రాలు, ప్రాంతాల్లో జనాభా లెక్కలు సేకరించలేదు’’ అని వివరించారు.
Wednesday, March 15, 2017
నాలుగు దశాబ్దాల్లో 3% తగ్గిన హిందువుల జనాభా
Sunday, March 12, 2017
Subscribe to:
Posts (Atom)